సంక్షేమమే చంద్రన్న చిరునామా…
1 min read

గడపగడపకు పెన్షన్లతో పలకరింపు
పెన్షన్ల పంపిణీ రాష్ట్ర చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం
హోలగుందా, న్యూస్ నేడు: దేశ చరిత్రలో సుస్థిర పాలన, సువర్ణ సంక్షేమానికి ఆధ్యుడైన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక సూపర్-6 లో భాగంగా తెల్లవారు జామున తొలిపిలుపై గడపగడపకు పెన్షన్లతో పలకరింపు. తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి చిన్నహ్యట శేషగిరి, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిదానంద, మండల కన్వీనర్ టి. తిప్పయ్య బృందం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు హొళగుంద మండల కేంద్రంలోని స్థానిక బీసీ కాలనీ, బుడగ జంగాల కాలని, బుడబుక్కల కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రజల వద్దకే పరిపాలన దిశగా ఆత్మీయంగా గడపగడపకు తొలిపిలుపై పెన్షన్ సొమ్మును పంపిణీ చేయడం జరిగింది. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రజా శ్రేయస్సుకై పరితపించే నాయకులు చిన్నహ్యట శేషగిరి మరియు కన్వీనర్ తిప్పయ్య వాడవాడల పెన్షన్ దారులకు సంకష్టంలోనూ సంక్షేమానికై పట్టు విడవని కూటమి ప్రభుత్వ కార్యనిష్ట, నిబద్ధత, పాలనా బాధ్యతలను ప్రత్యేకంగా వివరించడంతోపాటు వయసు మళ్ళీన వృద్ధులను, వికలాంగులను, వితంతువులను కుటుంబ సభ్యులై ఆత్మీయతతో వారి బాగోగులను తెలుసుకొని ప్రజలందరూ ప్రజా శ్రేయస్సు మరియు రాష్ట్ర ప్రగతికై కూటమి ప్రభుత్వానికి అడుగులో అడుగు అండదండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు బుడగ జంగాల లక్ష్మన్న, బూత్ ఇంచార్జ్ కురువ మల్లికార్జున, బాగోడి రాముడు మరియు సచివాలయ సిబ్బంది, పెన్షన్ దారులు, ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


