NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేరస్తులకు శిక్షపడేలా పోలీసుల చర్యలు..ఎస్పీ అభినందనలు..

1 min read

మహానంది, న్యూస్​ నేడు:  హత్య కేసులో ఒకరికి యావజ్జీవ శిక్ష మరొకరికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష జరిమాన విధించిన న్యాయస్థానం  నేరస్తులకు శిక్షపడేలా చర్యలు తీసుకున్న పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ.04.08.2015 రాత్రి నంద్యాల-గిద్దలూరు రోడ్డులోని మానసిక వికలాంగుల స్కూల్ సమీపంలోని సుబ్బయ్యకుంట, గోపవరం గ్రామం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు 40 ఏళ్ల వయస్సు గల ఒక వ్యక్తిని హత్య చేసి, జమ్మూ పొదల్లో పడి దహనం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మహానంది మండలం, గోపవరం గ్రామం వీఆర్​ఓ  వెంకట నారాయణ 05.08.15 at 08.00 గంటలకు, మహానంది పోలీస్ స్టేషన్ కు వచ్చి సంఘటన గురించి ఫిర్యాదు చెయ్యగా Cr.No 90/2015 U/s 302, 201 IPC గా కేసు నమోదు చేశారు.దర్యాప్తు అధికారి జమ్ములో కాలిన మృతుడి వివరాలు విచారించగా మృతుడు పేరు కౌడికె.బసవరాజు, వయస్సు 35 సంవత్సరాలు, s/o కె. పక్కీరప్ప, కొలిమిగుండ్ల గ్రామము మరియు మండలం బనగానపల్లిలో న్యాయవాదిగా జీవనం చేయుచున్నాడని కనుగొనడం జరిగింది.మృతుడు మరియు మొదటి ముద్దాయి అయిన బొడ్డు. సుజాత తో అక్రమ సంబంధం కలిగి ఉండి వారు ఇరువురు రహస్యంగా ఉన్న వీడియో మృతుడు మొబైల్ ఫోన్ లో ఉండటం వలన ఏ1 బొడ్డు సుజాతను కోరిక తీర్చమని మృతుడు అడుగుతున్నందున ఏ1 బొడ్డు సుజాత మృతుడు కౌడికె.బసవరాజును చంపి మొబైల్ ఫోన్ లో ఉన్న అశ్లీల వీడియో ను తీసివెయ్యాలి అనే ఉద్దేశ్యంతో ఏ2 బలిజ సాయన్నగారి నాగరాజు, ఏ3 వెంకటపురం నాగేంద్ర, ఏ4 ఇల్లురి వెంకట రెడ్డితో కలసి 04.08.2015 వ తేదిన రాత్రి ముద్దాయిలు మృతుడు ను కార్ లో బనగానపల్లె లో ఎక్కించుకొని కూల్ డ్రింక్ లో సైనాడ్ ను కలిపి తాపి చంపి అదే రోజు రాత్రి నంద్యాల-గిద్దలూరు రోడ్డులోని గోపవరం గ్రామం సుబ్బయ్యకుంట దగ్గర హత్య చేసి, జమ్మూ పొదల్లో పడి దహనం చేశారు. మృతుడు దగ్గర నుండి ఒక బంగారు గొలుసు, బంగారు ఉంగరం, ఏటిఎం కార్డు చోరీకి పాల్పడ్డారు. ఈ సందర్బంగా నంద్యాల జిల్లా ఎస్పీ  అధిరాజ్ సింగ్ రాణా, నంద్యాల సబ్ డివిసన్ ఏఎస్పీ కుమారి మంద జావళి అల్ఫోన్స్  మరియు నంద్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసులు రెడ్డి ల మర్డర్ కేసులో ముద్దాయిలకు కోర్ట్ లో ఏ2 కి యావజ్జీవకరాగార శిక్ష మరియు ఏ3 కి 7 సంవత్సరాల జైలు శిక్ష లో కీలక పాత్ర పోషిoచిన మహానంది పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్. రామ మోహన్ రెడ్డి, Addl PP’s :1) ఎం. తిరుపతి 2) వైవి. గోపాల కృష్ణ రెడ్డి. 3) ఎస్​.ఎన్​. రాజేశ్వర రెడ్డి, కోర్ట్ హెచ్​సి. విద్య సాగర్ లను ప్రత్యేకంగా అభినందించారు.

About Author