ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలి
1 min read

ఆప్కాస్ లో ఉన్న లోపాలను సరిదిద్ది, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన సేవలు అందేలా చూడాలి…
సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు మాదిరిగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి
కూటమి ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి
కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సుమన్ & ఈ.మధు బాబు.
కర్నూలు, న్యూస్ నేడు: కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలోగ జిల్లా నాయకులు ఎం రాముడు అధ్యక్షతన కర్నూల్లో నిర్వహించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు కే సుమన్, ఈ మధుబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమకు మేలు జరుగుతుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారని, దీనికి కారణం గతంలో 2014- 19 సంః కాలంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు 50% శాతం పెంచి వారిని ఆదుకున్న చరిత్ర ఉంది. అలాగే ఇప్పుడు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రస్తుతం అప్కాస్ లో ఉన్న చిన్న చిన్న లోపాలు సరిదిద్ది, ఇంకా మెరుగైన సేవలు అందించాలని ఆయన కోరారు .ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కొరకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైయున్న సంస్థ (ఆప్కాస్), దీనివలన ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ కొంత మేలు జరిగినప్పటికీ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను సి ఎఫ్ ఎం ఎస్ లో ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ వారికి, వారి కుటుంబానికి అందవలసిన సంక్షేమ పథకాలన్నీ రద్దు పరిచినారు. దీనివలన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయినారు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో 11వ పిఆర్సి కమిటీ మరియు సిఎస్ గారి కమిటీ ఇరువురు కూడా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచాలని సిఫారసు చేస్తే, గత ప్రభుత్వం కేవలం 23% మాత్రమే పెంచి వారికి తీవ్ర అన్యాయం చేసింది. గత ప్రభుత్వ హయాంలో అనేక సందర్భాలలో అనేక విజ్ఞప్తి పాత్రాలు ఇచ్చినప్పటికిని ఒక్కటి కూడా సమస్య పరిష్కారం కాలేదు.
హెచ్ఆర్ పాలసీG అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పన లో భాగంగా మెప్మా/ స్పెర్స్ ఉద్యోగులకు మాదిరిగా హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తూ ఉద్యోగ భద్రత భరోసా కల్పించాలని కోరారు. ఆ రెండు సొసైటీ యాక్ట్ కింద ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ సంస్థలు (మెప్మా, స్పెర్స్) అయినప్పటికీ వాటిల్లో పనిచేసే ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తుండగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయకపోవడం చాలా బాధాకరం అన్నారు.
సర్వీస్ రూల్స్:
ప్రభుత్వం పార్ట్ టైం ఉద్యోగులైన అంగన్వాడి వర్కర్స్, గ్రామ రెవెన్యూ సహాయకులు, ఆశా వర్కర్లు తదితరులకు ప్రభుత్వం సర్వీసు రూల్స్ ను ఏర్పాటు చేసి ఆదుకున్నారు. కానీ పూర్తి కాలం (ఫుల్ టైమ్) ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఇన్ని సంవత్సరాలుగా కనీసం సర్వీస్ రూల్స్ లేకపోవడం చాలా బాధాకరం. కనుక ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం సర్వీస్ రూల్స్ (నియమ నిబంధనలు) ఏర్పాటు చేసి, తద్వారా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
అదనపు బెనిఫిట్ (ఇంక్రిమెంట్లు); ఔట్సోర్సింగ్ ఉద్యోగులు గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికిని సీనియర్ కి జూనియర్ కి తేడా అంటూ లేకుండా ఒకే ప్రాతిపదికన జీతాలు ఇవ్వటం జరుగుతుంది. కనుక సీనియార్టీ ప్రాతిపదికన కనీస సర్వీస్ నిబంధన పెట్టీ, సంవత్సరం లేదా కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి అదనపు బెనిఫిట్ (ఇంక్రిమెంటు) ఇవ్వాలని కోరడం జరిగినది.
సంక్షేమ పథకాలు వర్తింపు: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సంక్షేమ పథకాలు వర్తింప చేసి, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని కోరడం జరిగినది. ఏపీ జేఏసీ అమరావతి కర్నూల్ జిల్లా చైర్మన్ కే వై కృష్ణ మాట్లాడుతూ ఏపీజేఏసీ అమరావతి మీకందరికీ అండగా ఉంటుందని ఏ సమస్య వచ్చినా మమ్మల్ని సంప్రదించాలని అన్నివేళలా అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పి. రామ్ భద్ర, సెక్రటరీ చారి, ఎం నాగరాజు, ఎం అమిదాబి, శ్రీధర్ Apgli ,సంధ్య, సరస్వతి, సోమన్న , సరోజ, సావిత్రి , యశోద తధితరులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

