NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాల్య వివాహాలు.. భిక్షాటన చేసే పిల్లలపై సమాచారం ఇవ్వండి

1 min read

కడప మహిళా శిశు సంక్షేమ శాఖ.సి డి పి ఓ ఎస్ శాంతమ్మ

చెన్నూరు, న్యూస్ నేడు:  పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో బిక్షాటన చేసే పిల్లలు తో పాటు బాల్య వివాహాలు జరిగిన వెంటనే 1098 కి సమాచారం ఇవ్వాలని కడప మహిళా శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ ఎస్ శాంతమ్మ కోరారు. చెన్నూరు మండలం చెన్నూరు. కొండపేట ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం కడప మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో సిడిపిఓ ఎస్ శాంతమ్మ మాట్లాడుతూ పిల్లలు ఏ పని చేసినప్పటికీ ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పిల్లలు సత్ ప్రవర్తనతో మెలగాలని అప్పుడే పిల్లలు అనుకున్నటువంటి గమ్యస్థానాన్ని చేరుకోగలరని తెలియజేశారు. బిక్షాటన చేసే పిల్లలతో పాటు బాల్యవివాహాలు జరుగుతున్న విషయాన్ని వెంటనే1098 కి సమాచారం ఇవ్వాలని సూచించారు. 18 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ ఈ చట్టం పరిధిలో వస్తారని వివరించారు. ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు పిల్లలు చాలామంది అనేక రకాల సమస్యలతో ఉన్నారని అటువంటి వారికి ప్రభుత్వం మిషన్ వాత్సల్య పథకం ద్వారా అందిస్తున్నటువంటి సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం. లక్ష్మీ ప్రసన్న సిబ్బంది ఐసిడిఎస్ సూపర్వైజర్లు గుర్రమ్మ సచివాలయ మహిళా పోలీసులు. అంగన్వాడి కార్యకర్తలు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు. పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author