NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా  పాత పెన్షన్లను తొలగించడం దుర్మార్గమైన చర్య

1 min read

ప్రభుత్వం వెంటనే పునరాలోచించి 1వ, తేదీ అందరికీ పెన్షన్లు అందేటట్లు  చూడాలి

వైఎస్ఆర్సిపి రాష్ట్ర పంచాయతీరాజ్ విభాజ ప్రధాన కార్యదర్శి చీర్ల సురేష్ యాదవ్

 చెన్నూరు, న్యూస్ నేడు:  కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఏడాది కాలంలోనే దాదాపు నాలుగున్నర లక్షల పెన్షన్లు తీసివేయడం జరిగిందని 15 సంవత్సరాలు నుండి పెన్షన్ తీసుకుంటున్న వారిని కూడా తొలగించడం దారుణమని ఎలాంటి పనులు చేసుకోలేని దివ్యాంగుల పెన్షన్లు తీయడం ఎంతవరకు సబబు అని ప్రభుత్వం దీనిపై పునరాలోచించి సరైన నిర్ణయం తీసుకొని వచ్చే సెప్టెంబర్ 1వ తేదీ నాటికి అర్హులైన అందరికీ పెన్షన్లు అందేటట్లు చూడాలని వైఎస్ఆర్సిపి రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ ప్రధాన కార్యదర్శి చీర్ల సురేష్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదికాలం గడిచిన తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లతోపాటు దివ్యాంగుల పెన్షన్లు కూడా తొలగించడం దారుణమని తల్లి తండ్రి లేక అనాధలుగా పెన్షన్ పైనే ఆధారపడి జీవిస్తున్న వికలాంగుల పెన్షన్లు తొలగించడం బాధాకరమన్నారు. ఇలాంటి దివ్యాంగుల పెన్షన్లు తొలగించడంలో ప్రభుత్వం మరోసారి పునరాలోచించి దివ్యాంగులకు న్యాయం జరిగే విధంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 15 సంవత్సరముల నుండి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వికలాంగులపై కూడా అనర్హత వేటు వేయడం కూటమి ప్రభుత్వానికే చెల్లిందని చెప్పడం జరిగింది. దీనిపై పలుచోట్ల నిరసనలకు దివ్యాంగులు దిగడం వారి బాధను వ్యక్తపరచడం తో సగటు మానవునికి కూడా బాధ కలగడం జరిగిందని తెలిపారు. అలాంటిది ఈ విషయమై ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆయన ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. దివ్యాంగులకు గత ప్రభుత్వంలో ఇంటింటికి వెళ్లి పారదర్శకంగా పెన్షన్లు అందించిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని ఆయన అన్నారు. పెన్షనే జీవనాధారంగా భావించే కొంతమంది వృద్ధులు పెన్షన్లు ఆగిపోవడంతో ఆందోళనలకు గురై మరణించిన పరిస్థితి కూడా రాష్ట్రంలో ఏర్పడిందని ఇలా కూటమి ప్రభుత్వం వికలాంగులపై, దివ్యాంగులపై కక్ష సాధింపు చర్యలు మానుకుని వారికి పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.

About Author