NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కోటి 60 లక్షలతో సిసి రోడ్డుకి శంకుస్థాపన

1 min read

శంకుస్థాపన చేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహాన్ పెదబాబు

నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం పై ప్రత్యేక దృష్టి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : రావాల్సిన నిధులను రాబడుతూనే అవసరమైన అభివృద్ధికి అంకురార్పణ చేస్తున్నామనీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఏలూరులోని బిడి కాలనీ గట్టు వద్దనుండి జంగారెడ్డిగూడెం మెయిన్‌ రోడ్డు వరకూ 28, 49 డివిజన్‌ల పరిధిలో నాబార్డ్‌ నిధులు కోటి 60లక్షల రూపాయలతో చేపట్టిన అంతర్గత సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబులు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తొలుత కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్‌ నూర్జహాన్‌లకు స్థానిక విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే చంటి,పరిష్కారానికి చర్యలు చేపడతామనీ హామీ ఇచ్చారు. ఇదేక్రమంలో పలువురు స్థానిక మహిళలు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులకు చర్యలు చేపట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ వివిధ గ్రాంట్లతో ఏలూరు నగరంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ముఖ్యంగా అభివృద్ధికి ఎక్కడా ఆటంకం కలగకూడదనే ఆలోచనతోనే ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నామనీ ఆయన స్పష్టం చేశారు. మేయర్‌ నూర్జహాన్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల అరుణా సురేష్, 49వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ  శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ నేరుసు గంగరాజు క్లస్టర్ ఇంచార్జ్ రెడ్డి నాగరాజు, కో- క్లస్టర్ ఇంచార్జ్ ఆర్నెపల్లి తిరుపతి,ఎఎంసి ఛైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటి మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవానీ, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్.కె కాజా మరియు వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు,పలువురు కార్పొరేటర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author