NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా గణేష్ మహోత్సవాలు…

1 min read

ది విజయవాడ త్రీ వీలర్స్ ఆటో కన్సల్టెన్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ మహోత్సవాలు

విజయవాడ ,న్యూస్​ నేడు:  ది విజయవాడ త్రీ వీలర్స్ ఆటో కన్సల్టెన్సీ అసోసియేషన్ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేశ చతుర్థి మహోత్సవాలు ఘనంగా జరిగాయని ప్రముఖ లాయర్ ప్రసాదరావు అన్నారు.ఈ సందర్భంగాఆయన మీడియాతో మాట్లాడుతూ   గత ఏడాదినుండి గణేష్ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం 2 వసారి కూడా గణేష్ మహోత్సవములు  అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా 27వ తేదీ నుండి 1 వ తేదీ వరకు శ్రీ గణేష్ పూజ మహోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆగస్టు 1వ తేదీన  నాడు అన్నదాన కార్యక్రమం సుమారు 5000 మందికి నిర్వహిస్తున్నామని ఆ తర్వాత శ్రీ వినాయకుని లడ్డు వేలం పాట నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం శ్రీ వరసిద్ధి వినాయకుని మేళ తాళాలతో ఊరేగించి నిమజ్జన కార్యక్రమం కనుల పండువగా జరపనున్నట్లు వ్యక్తపరిచారు. శ్రీ గణేష్ పూజ మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని వినాయకుని ఆశీస్సులు పొందవలసిందిగా  భక్తులకు పిలుపునిచ్చారు.శ్రీ గణేష్ మండపము ఏర్పాటుకు మహోత్సవములు నిర్వహించేందుకు పోలీస్ శాఖ వారు సింగిల్ విండోస్ పద్ధతి ప్రకారం ఆన్లైన్లో పర్మిషన్ ఇచ్చి తమకు ఎంతో సహకరించారని ఈ ఆన్లైన్ పద్ధతి వలన సింగిల్ విండో ద్వారా చాలా సులభంగా పర్మిషన్లు పోలీస్ శాఖ నుండి లభించాయని అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ నుండి కూడా అన్ని పర్మిషన్లు లభించాయని అందువలన సిటీ కమిషనర్ కి పోలీస్  శాఖకి, మున్సిపల్ శాఖకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఆంధ్ర రాష్ట్ర కూటమీ ప్రభుత్వం కొత్త ఆటోలకు పర్మిషన్ ఇవ్వకుండా ఉన్న జీవోను తీసుకొని వస్తే ఇప్పుడున్న ఆటో వాళ్లకి ఎంతో ఉపయోగకరంగా ఉండేదని తెలిపారు. ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యం వలన విజయవాడ సిటీలో ఆటోలు ఎక్కువగా ఉండడం వల్ల ఆటో వాళ్ళ జీవనోపాధి చాలా ఇబ్బందికరంగా ఉన్నదని ఆటోల నడుపుకొని వాళ్ల పిల్లల్ని చదివిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారని ఆర్థికంగా వెనకబడి పోతున్నారని అందువల్ల కొత్త ఆటోలకు పర్మిషన్ ఇవ్వకుండా జీవో ని తీసుకొచ్చి  ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి ది విజయవాడ త్రీ వీలర్స్ ఆటో కన్సల్టెన్సీ అసోసియేషన్ కమిటీ సభ్యులు పి రాంబాబు, జె శేఖర్ సిహెచ్ వెంకట్ ఎం ఉదయ్ కుమార్, టి అరవింద్, ఎస్ కే బాజీ బి శంకర్, సామ్యూల్, చంటి, పైడిరాజు,రాము, సాయి రాము, నాని, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author