NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అట్టహాసంగా సర్వోత్తమ్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

1 min read

ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే..గౌరు,మాండ్ర..

నందికొట్కూరు, న్యూస్ నేడు:  బ్రాహ్మణకొట్కూరు సహకార సొసైటీ చైర్మన్ మద్దూరు హరి సర్వోత్తమ్ రెడ్డి ప్రమాణస్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది.నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, నందికొట్కూరు టీడీపీ ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి,నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానందరెడ్డి హాజరయ్యారు. సోమవారం గ్రామంలోని ఫంక్షన్ హాల్ లో నూతన సొసైటీ చైర్మన్ సర్వోత్తమ్ రెడ్డి అతిధులను భారీ ఊరేగింపుగా ఘన స్వాగతం పలికారు.సొసైటీ అధికారులు నూతన చైర్మన్ సర్వోత్తమ్ రెడ్డి మరియు సభ్యులు శ్రీనివాసులు,నాగశేషులు నాయుడు తో ప్రమాణ స్వీకారం చేయించారు.తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తామని గతంలో ఎంతోమంది సీఎం లను చూశాం దేశంలో ఎక్కడా లేనివిధంగా”ప్రజల వద్దకు పాలన-జన్మభూమి”వాటిని తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కిందని అన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉందని అదేవిధంగా రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో పార్టీని ఆశీర్వదించాలని మాండ్ర శివానందరెడ్డి కోరారు.కష్టపడ్డ ప్రతి కార్యకర్తను పార్టీ ఆదుకుంటుందని కార్యకర్తలకు అండగా ఉంటామని అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ రైతు ప్రభుత్వం అని రైతులకు పార్టీ అండగా ఉంటుందని గౌరు వెంకటరెడ్డి అన్నారు.నూతన కమిటీ సభ్యులను అతిధులు మరియు నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,ఉదయ్ కిరణ్ రెడ్డి,జయరామిరెడ్డి,ఖా జా హుస్సేన్ మరియు నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

About Author