ఘనంగా ఉప ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు…
1 min read
సుధా బత్తుల శ్రీదేవి ఆధ్వర్యంలో ఫ్రూట్స్ పంపిణీ కేక్ కటింగ్ కార్యక్రమం
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏలూరు నియోజకవర్గం 11వ డివిజన్ పెద్దమ్మ వారి గుడి వద్ద సుధా బత్తుల శ్రీదేవి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్నేళ్లుగా పవన్ జన్మదిన రోజు సేవ కార్యక్రమాలు సుధా బత్తుల శ్రీదేవి నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు హాజరై పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు కాపు సంఘ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మెగా అభిమానులు పాల్గొన్నారు.


