NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆపస్ ఆధ్వర్యంలో మన పాఠశాల మన ఆత్మ గౌరవం కార్యక్రమం

1 min read

ఒంగోలు, న్యూస్​ నేడు : ఒంగోలో ఏకేవీకే కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో  మన పాఠశాల మన ఆత్మగౌరవం పోస్టర్ను ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ శ్రీ ఏ వేణుగోపాల్ నాయుడు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను తల్లిదండ్రులు ప్రోత్సహించేలాగా చూడాలని, విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు బోధించాలని, మాతృభాషలో విద్యాబోధన జరుగునట్లు ఆపస్ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన కార్యదర్శి సి.హెచ్ శ్రావణ కుమార్, ప్రకాశం జిల్లా అధ్యక్షులు కే. మల్లికార్జున రావు ,ఆంధ్రకేసరి విద్యా కేంద్రo  అధ్యక్షులు మండవ నాగేశ్వరరావు జిల్లా బాధ్యులు కే. శంకర్రావు , బి .వి.ఎస్ గుణ ప్రసాద్, వై.కోటేశ్వరరావు, కే .విశ్వేశ్వరరావు, మధుసూదనరావు, ప్రసాద్, రాము ,హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

About Author