శరన్నవరాత్రి ఉత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పణ
1 min read
మహానంది, న్యూస్ నేడు: మహానంది క్షేత్రంలో జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలకు పట్టు వస్త్రాలను హైదరాబాద్ కు చెందిన వారణాసి రామ్మోహన్ ఆయన సతీమణి విజయలక్ష్మి దంపతులు పట్టు వస్త్రాలను శుక్రవారం సమర్పించినట్లు ఆలయ సూపరిండెంట్ శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి క్షేత్రంలో జరిగే శరన్నవరాత్రి మరియు మహాశివరాత్రి ఉత్సవాలకు పట్టు వస్త్రాలను పైన పేర్కొన్న దాత పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నట్లు వేద పండితులు రవిశంకర్ అవధాని తెలిపారు . క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను శాస్త్ర యుక్తంగా, ఘనంగా ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు నాగేశ్వర శర్మ, ఆలయ ఉపప్రధాన అర్చకులు శంకరయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

