NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జి పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్సీసీ ఎంపికలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  స్థానిక జి పుల్లయ్య ఇంజనీరింగ్ స్వయం ప్రతిపత్తి కళాశాలలో ప్రధమ బీటెక్ విద్యార్థినీ విద్యార్థులకు ఎన్సిసి లో ఎంపికలు జరిగాయి ఇందులో భాగంగా విద్యార్థినీ విద్యార్థులకు పరుగు పందెంతోపాటు దేహదారుద్య పరీక్షలను నిర్వహించి అందులో 17 బాలురను ఆరు బాలికలను ఎంపిక చేశారు కళాశాల ఎన్సిసి చరిత్రలో ప్రప్రధమంగా బాలికలకు ఎన్సీసీలో అవకాశం ఇవ్వడం జరిగింది ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి శ్రీనివాసరావు అభినందనలు తెలియజేశారు ఎన్సిసి క్యాడేట్లను ఉద్దేశించి కళాశాల అడ్మినిస్ట్రేటివ్ డాక్టర్ ఎం గిరిధర్ కుమార్ మాట్లాడుతూ తమ కళాశాల కేతనాన్ని జాతీయస్థాయిలో ఎగురవేయాలని ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ డీన్ ప్రొఫెసర్ జి శశి కుమార్ ఎన్సిసి అధికారి లెఫ్టినెంట్ మధు శేఖర్ 28 ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి అధికారులు పాల్గొన్నారు.

About Author