NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎవ్వరూ చేయనంత అభివృద్ధి చేస్తున్నా..

1 min read

రైతులందరికీ యూరియా: ఎమ్మెల్యే

రసాభాసగా మిడుతూర్ సమావేశం..

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు  : ఇంతవరకూ ఏ ఎమ్మెల్యే చేయనంతగా మిడుతూరు మండలాన్ని నేను అభివృద్ధి చేస్తూ ఉంటే ఇక్కడ కొందరు అభివృద్ధికి అడ్డుపడుతూ ఉన్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన జరిగింది.ఈ సమాసానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.ఈ సమావేశం రసాభాసగా సాగింది. ముందుగా గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పెరిగిపోయాయని వైస్ ఎంపీపీ నభి రసూల్,ఎంపిటిసి హరి సర్వోత్తమ రెడ్డి అన్నారు. జలకనూరు జిల్లా పరిషత్ పాఠశాలలో వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా ఉందని సర్పంచ్ ఎల్లయ్య అన్నారు. చౌట్కూర్ లో పశు వైద్యశాల మంజూరు చేయాలని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. వ్యవసాయ ఏఓ పీరు నాయక్ మాట్లాడుతుండగా యూరియా ఎవరెవరికీ ఇచ్చారో అర్థం కావడం లేదనిఎంపీపీ వెంకటేశ్వరమ్మ,నబి రసూల్,ఎంపిటిసి హరి సర్వోత్తమ్ రెడ్డి,సర్పంచు స్వామి రెడ్డి ప్రశ్నించారు.మండల పరిషత్ రోడ్డు మరియు గార్గేయపురం- మిడుతూరు రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిందని సభ్యులు మరియు పీరుసాహెబ్ పేట ప్రజలు ఎమ్మెల్యేకు విన్నవించారు. కడుమూరు,చింతలపల్లె, సుంకేసుల గ్రామాలకు పంచాయతీ భవనాలు మంజూరు అయ్యారని పీఆర్ఏఈ ప్రతాప్ రెడ్డి తెలిపారు.తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ యూరియా ప్రతి ఒక్కరికీ ఇస్తామని 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చిన తర్వాత మొదటగా గ్రీన్ అంబాసిడర్ల జీతాలు ఇచ్చిన తర్వాతనే మిగతా వాటికి వాడుకోవాలన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులు మరియు కార్యాలయాల్లో మధ్యాహ్ననికే ఇంటికి వెళ్తున్నారని అలా వెళ్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.జలకనూరు మద్దిగుండం చెరువు గండి గురించి సభ్యులు అడగ్గా 40 లక్షలతో ప్రతి పాదనలు పంపించామని నిధులు నిధులు మంజూరు అయితే రింగుబండ్ వేయించాల్సి ఉంది టెండర్ ప్రాసెస్ లో ఉందన్నారు.సమావేశానికి ఆర్ &బి శాఖ అధికారులు రాకపోవడంతో కలెక్టర్ కు లెటర్ పంపిస్తానని ఎమ్మెల్యే అన్నారు.చౌటుకూరు పశువైద్యశాలకు స్థలం చూపించాలని తహసిల్దార్ ను ఎమ్మెల్యే ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, సహకార సొసైటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి,ఎస్ఐ ఓబులేష్ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

About Author