అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలి…
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి శ్రీ లీల వెంకట శేషాద్రి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ ,మహిళా శిశు సంక్షేమ శాఖ , జిల్లా బాలల పరిరక్షణ విభాగంల సంయుక్త ఆధ్వర్యంలో నేడు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహం బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రాంగణంలో 7, 8 ,9 వ తరగతి విద్యార్థినిలకు గుడ్ టచ్ ,బ్యాడ్ టచ్ పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా డి.సి.పి.ఓ శారద మాట్లాడుతూ ఆధునిక సాంకేతితో కూడిన సెల్ ఫోన్లతో జాగ్రత్తగా ఉండేలా తల్లిదండ్రులు పిల్లలకు సూచనలు ఇవ్వాలన్నారు.లీగల్ సర్వీసెస్ యూనిట్ మెంబర్ ,పారా లీగల్ వాలంటీర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లలు లైంగిక వేధింపులకు గురైనప్పుడు వెంటనే 1098 నెంబర్ కు సంప్రదించాలని కోరారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగాధికారి అడ్వకేట్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ విద్యతో పాటు నైతిక విలువలు ,సమాజం పట్ల అవగాహన కలిగేలా ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచనలు ఇవ్వాలన్నారు.ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఆఫీసర్ సైలజ మాట్లాడుతూ ముఖ్యంగా ప్రయాణం చేసేటప్పుడు విద్యార్థినిలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

