ది ఏలూరు అవుట్ డోర్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ కార్యవర్గ ఎన్నిక
1 min read

గౌరవ అధ్యక్షులుగా 5వ సారి ఎస్ఎన్ఆర్ పెదబాబు
అధ్యక్ష,కార్యదర్శులుగా వై.రంగారావు, వెంకట్
ఫోటోగ్రఫీ,వీడియోగ్రాఫి ఒక అద్భుతమైన కళ
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ది.ఏలూరు అవుట్డోర్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా 5వ సారి ఏకగ్రీవంగా నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఎన్నికయ్యారు.ఆదివారం స్థానిక పవర్ పేట ఐఎంఏ హాల్లో ఆదివారం జరిగిన ది.ఏలూరు అవుట్డోర్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులుగా ఎస్ ఎం ఆర్ పెదబాబు,అధ్యక్షులుగా వై.రంగారావు,కార్యదర్శి గా వెంకట్,ట్రెజరర్ బి.అప్పారావు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా జరిగిన సభలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ,వీడియో గ్రాఫి ఒక అద్భుతమైన కళని మారుతున్న కాలానికి, టెక్నాలజీకి అనుగుణంగా ఫోటో,వీడియో గ్రాఫర్స్ మారవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు, అయితే మొబైల్ ఫోన్స్ వచ్చాక ఫోటో,వీడియో గ్రాఫర్స్ వృత్తి వెనకబడిందన్నారు. అవుట్ డోర్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ పడుతున్న ఇబ్బందులు దృశ్య ప్రభుత్వ పరంగా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ కు అందవలసిన సహకారాన్ని పూర్తిగా అందే వరకు తాను కృషి చేస్తానని సభాముఖంగా ఎస్ఎంఆర్ పెదబాబు హామీ ఇచ్చారు.అనంతరం అసోసియేషన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబును శాలువా కప్పి పూల బొకే అందించి మెమెంటో ఇచ్చి ఘనంగా సత్కరించారు. అభిమానంతో ఆప్యాయతతో సత్కరించిన ప్రతి ఒక్కరికి పెదబాబు కృతజ్ఞతలు తెలియజేశారు.


