ఎన్ ఎస్ ఎస్ విభాగం యూత్ పర్స్ నల్ డెవలప్మెంట్ కార్యక్రమం
1 min read

విద్యార్థులకు ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేత
ఇటువంటి కార్యక్రమాలతో విద్యార్థులు వ్యక్తిత్వ వికాసం, మాట్లాడే ధైర్యం అలవర్చుకుంటారు
ప్రిన్సిపల్ వంగా వెంకటేశ్వరరావు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు సత్రంపాడు లోని ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో యూత్ పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ వంగ వెంకటేశ్వర రావు,ఎన్ ఎస్ ఎస్ కో-ఆర్డినేటర్ కే హరిబాబు మరియు వివేకానంద కేంద్ర అధ్యాత్మిక సేవ ప్రేరేపిత సంస్థ రవి నాయుడు ప్రాంతీయ సంఘటకులు మరియు గండికోట శ్రీనివాసరావు విభాగ సంఘటకులు మరియు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థులు తమ వ్యక్తిత్వన్నీ సేవా కార్యక్రమాలతో అభివృద్ధి చేసుకొని సమాజంలో ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమం లో వివేకానంద కేంద్ర అధ్యాత్మిక సేవ ప్రేరేపిత సంస్థ విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్,లీడర్ షిప్ క్వాలిటీస్,టీమ్ వర్క్,సెల్ఫ్ కాన్ఫిడెన్స్,రీల్ మేకింగ్ వంటి అంశాలపై వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన రీల్ మేకింగ్ కార్యక్రమంలో సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులకు ద్వితీయ మరియు తృతీయ బహుమతులు వచ్చాయి.ఈ ప్రోగ్రామ్ లో విద్యార్థులు చురుకుగా పాల్గొని గ్రూప్ డిస్కషన్,రోల్ ప్లే యాక్టివిటీ, క్విజ్ సెషన్స్, నిర్వహించారు.దీని వల్ల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, మాట్లాడే ధైర్యం కొత్త ఆలోచనలు పెరిగాయన్నరు.


