NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో శ్రీ వాసవి మాత

1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి అమ్మవారి శాలలో దసరా నవరాత్రుల పురస్కరించుకుని  రెండవ రోజు మంగళవారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో శ్రీ వాసవి మాత దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు భక్తిశ్రద్ధలతో ఉదయం నుంచి పారాయణం, కుమార్చనలు ,దీప దూప పుష్పాలతో పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు  రాజా మురళీకృష్ణ,ఉపాధ్యక్షులు  బైసాని సురేష్,కార్యదర్శి ఊటుకూరి రమేష్ కుమార్, కోశాధికారి జొన్నలగడ్డ హరిక్రిష్ణ,సహాయ కార్యదర్శులు  బైసాని గిరిబాబు,యిసికేల మురళీక్రిష్ణ,సహాయ కోశాధికారులు నాయకంటి గురుప్రసాద్,జక్క శేషఫణి మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

About Author