బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో శ్రీ వాసవి మాత
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి అమ్మవారి శాలలో దసరా నవరాత్రుల పురస్కరించుకుని రెండవ రోజు మంగళవారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో శ్రీ వాసవి మాత దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు భక్తిశ్రద్ధలతో ఉదయం నుంచి పారాయణం, కుమార్చనలు ,దీప దూప పుష్పాలతో పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రాజా మురళీకృష్ణ,ఉపాధ్యక్షులు బైసాని సురేష్,కార్యదర్శి ఊటుకూరి రమేష్ కుమార్, కోశాధికారి జొన్నలగడ్డ హరిక్రిష్ణ,సహాయ కార్యదర్శులు బైసాని గిరిబాబు,యిసికేల మురళీక్రిష్ణ,సహాయ కోశాధికారులు నాయకంటి గురుప్రసాద్,జక్క శేషఫణి మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


