NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైలంలో సాంస్కృతిక కార్యక్రమాలు

1 min read

శ్రీశైలం, న్యూస్​ నేడు: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈ రోజు ( 07.10.2025)  శ్రీ రాగరమ్య కల్చరర్ ఆర్గనైజేషన్, హైదరాబాద్ వారిచే సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి  ఈ  సంప్రదాయ నృత్యకార్యక్రమం ఏర్పాటు చేయబడింది.ఈ కార్యక్రమములో మహాగణపతి, శివతాండవం, సదాశివునికి, శివాష్టకం తదితర గీతాలకు, స్తోత్రాలకు, అష్టకాలకు  మాన్వి, కావ్య, సహస్ర, ఓంకార్, లక్ష్మిప్రసన్న, హేమా తదితరులు నృత్యప్రదర్శన చేయనున్నారు.కాగా   ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి.శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ.

About Author