ప్రధాని సభను విజయవంతం చేద్దాం.. మంత్రి టీజీ భరత్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: అనంతపూర్ నుండి కర్నూలు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 16వ తేదీన ప్రధాని పర్యటనను ప్రజలు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కర్నూలుకు ప్రధాని మోదీ వస్తున్నందున చాలా అంచనాలున్నాయన్నారు. నాటి రాజధాని అయిన కర్నూలుపై ప్రధాని మోదీకి అవగాహన ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతమైన కర్నూలుకి ప్రధాని మోదీ ఏమైనా వరం ప్రకటిస్తారా అన్న ఆశ ప్రజల్లో ఉందన్నారు. ఇక తమ కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వలన ప్రజలకు చాలా మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.


