NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న్యూమోనియా’ పై అవగాహన

1 min read

జాగ్రత్లతో.. శ్వాస కోశ వ్యాధి ని నివారించవచ్చు..

ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ సువర్ణ కల్లి

మెడికవర్ లో వ్యాది పై అవగాహన సదస్సు..

కర్నూలు హాస్పిటల్, న్యూస్ నేడు : వరల్డ్ న్యూమోనియా డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్, కర్నూలులో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వైద్యులు న్యూమోనియా వ్యాధి కారణాలు, నివారణ మార్గాలు మరియు సమయానికి చికిత్స పొందడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.డా. సువర్ణ లక్ష్మి కల్లి (Consultant Pulmonologist) మాట్లాడుతూ – “న్యూమోనియా శ్వాసకోశ సంబంధిత తీవ్రమైన వ్యాధి. చిన్న పిల్లలు, వృద్ధులు, మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ వ్యాధికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. టీకాలు, ఆరోగ్యకర జీవనశైలి, మరియు పర్యావరణ పరిశుభ్రత ద్వారా న్యూమోనియాను నివారించవచ్చు,” అని తెలిపారు.డా.కె సిందూర రెడ్డి (Consultant Pediatrician & Neonatologist) మాట్లాడుతూ – “పిల్లల్లో న్యూమోనియా ఒక ప్రధాన ఆరోగ్య సమస్య. ప్రారంభ దశలో గుర్తించి సరైన వైద్యం చేయడం ద్వారా తీవ్రమైన పరిస్థితులను నివారించవచ్చు. తల్లిదండ్రులు చిన్నారుల్లో దగ్గు, జ్వరం, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలను గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి,” అని సూచించారు.డా. వై. గణేష్ (Consultant Pediatrician) మాట్లాడుతూ – “న్యూమోనియా నివారణలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లలకు సరైన వయసులో టీకాలు వేయించడం ద్వారా ఈ వ్యాధి నుండి రక్షణ పొందవచ్చు. చిన్నారుల రోగనిరోధక శక్తిని పెంపొందించడం తల్లిదండ్రుల బాధ్యత,” అని చెప్పారు.డా. అనుషా (Consultant Pediatrician) మాట్లాడుతూ – “పిల్లలలో శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు తేలికగా తీసుకోకూడదు. శుభ్రమైన ఆహారం, స్వచ్ఛమైన వాతావరణం, మరియు సమయానికి వైద్య సూచనలు తీసుకోవడం ద్వారా న్యూమోనియాను నియంత్రించవచ్చు,” అని తెలిపారు.క్లస్టర్ హెడ్ శ్రీ మహేశ్వర్ రెడ్డి గ మాట్లాడుతూ – “మెడికవర్ హాస్పిటల్ ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపు కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తోంది. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో వ్యాధి నిరోధకతకు దోహదపడతాయి,” అని పేర్కొన్నారు.

About Author