కర్నూలు ఆర్ టి సి బస్టాండ్ లో విస్తృత తనిఖీలు
1 min read

కర్నూలు డిఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్.
కర్నూలు, న్యూస్ నేడు: ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాలతో కర్నూలు పట్టణంలో ఏలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా కర్నూలు ఆర్ టి సి బస్టాండ్ ఆవరణంలో, నెలల తరబడి బైక్ లు, కార్లు పార్కింగ్ చేసిన ప్రదేశాలలో , పార్సిల్ రవాణా కార్యాలయంలో తనిఖీలు చేపట్టామని కర్నూలు డిఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్ తెలిపారు. ఈ సంధర్బంగా గురువారం కర్నూలు డిఎస్పీ కర్నూలు పట్టణ సిఐలు నాగరాజారావు, మన్సురుద్దీన్, కర్నూలు నాల్గవ పట్టణ ఎస్సై శ్రీనివాసులు, స్పెషల్ పార్టీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు, పోలీసు జాగీలాల తో కలిసి కర్నూలు ఆర్ టిసి బస్టాండ్ లోని అనుమానితుల ప్రయాణికుల బ్యాగులు, బస్టాండ్ పరిసరాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.అనుమానితుల కదలికలు, పార్సిల్ కార్యాలయంలో లగేజీలపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించారు.అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 112 కు గాని , డయల్ 100 కు గాని , స్ధానిక పోలీసులకు గాని సమాచారం అందించాలని ప్రజలకు కర్నూలు డిఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్ సూచించారు.

