వీధి కుక్కల సమస్య నుండి పరిష్కారం చేయండి.. ఎస్డీపిఐ
1 min read

హొళగుంద న్యూస్ నేడు : హోళగుంద మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చలువాది రంగమ్మ, కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ కి సోషియల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున తెలియజేయు ముఖ్య విషయం:- మన వార్డు – మన బాధ్యత ఇంటింటి సంక్షేమ సర్వే కార్యక్రమం లో భాగంగా వార్డులలో ప్రతి ఇంటికి వెళ్లి వార్డు సమస్యలు మరియు ప్రజల సమస్యల గురించి సర్వే నిర్వహించడం జరిగింది అందులో ముఖ్యంగా ఇప్పుడు ప్రజలు మనకు తెలిపిన ముఖ్య సమస్యల్లో భాగంగా హోళగుంద గ్రామంలో వీధి కుక్కల సంఖ్య పెరిగి, అంటు వ్యాధులు (మాంగ్, రాబీస్) వ్యాపిస్తున్నాయి. దీనివల్ల అలర్జీలు, చర్మ రోగాలు పెరిగాయి. వీధి కుక్కలు ఇండ్లలో దూరి చిన్నపిల్లలకు గాయాలపాలు చేస్తున్నాయి 3నెలల్లో దాదాపు 30+ చర్మవ్యాధుల, పేషెంట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు , ప్రజలు భయం, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆర్థికంగాను నష్టపోతున్నారు.
అభ్యర్థనలు:
1. ABC ప్రోగ్రామ్: స్టెరిలైజేషన్, రాబీస్ వ్యాక్సినేషన్ క్యాంపులు (70% కవరేజ్).
2. వ్యాధి నియంత్రణ: అంటు కుక్కలకు చికిత్స/యూన్‌థానేషియా (ABC రూల్స్ ప్రకారం).
3. అవగాహన: కాటు చికిత్స, హెల్ప్‌లైన్ (155304) ఏర్పాటు.
4. మానిటరింగ్: వార్డు-వారీ సర్వే, నెలవారీ రిపోర్టులు.
చట్టం: PCA యాక్ట్ 1960, ABC రూల్స్ 2023 ప్రకారం స్థానిక సంస్థలు చర్యలు తీసుకోవాలి. ఈ సమస్యను మీరు పరిగణలోకి తీసుకొని ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వెంటనే సమస్య పరిష్కారం చేయాలని ప్రజల తరఫున ఎస్డీపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నాము.15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ సుభాన్, ఏం రహమతుల్లా, కె ఆరిఫ్, ఎం భాష, బి, రహమతుల్లా ఎస్ డి పి ఏ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

