NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ సూర్య స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

1 min read

జాతీయ బాలల దినోత్సవ సంబరాలు విద్యార్థుల ఆటపాటలతో అంబరాన్నంటిన కేరింతలు

స్కూల్ డైరెక్టర్స్ కొండపల్లి.చంద్రశేఖరరావు లక్ష్మి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: శ్రీ సూర్య స్కూల్లో జాతీయ బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థుల ఆటపాటలతో అంబరానితాకే విధంగా కేరింతలు నిర్వహించామని శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్స్ కొండపల్లి చంద్రశేఖర రావు, కొండపల్లి లక్ష్మీ తెలిపారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి పౌరులని కావున విద్యార్థులందరూ మంచి గా విద్యాబుద్ధులు నేర్చుకొని  జాతీయ నాయకుల స్ఫూర్తితో దేశ అభ్యున్నతికి కృషి చేయాలనిఆయన ఆకాంక్షించారు. ముందుగా మన దేశ ప్రధమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి  వేడుకలను ప్రారంభించారు.   విద్యార్థులందరూ విద్య తోపాటు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదగాలని వారు అభిలషించారు.        ఈ సందర్భంగా 2024-25 విద్యా సంవత్సరం పదవ తరగతిలో  591 మార్కులతో తమ సత్తా చాటి స్కూల్ ఫస్ట్ వచ్చిన కె.నాగ చరణ్ తేజ, మరియు సిహెచ్ కార్తికేయలకు రూపాయలు10000 నగదు ప్రధానం చేశారు. జాతీయస్థాయి, రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ కి ఎంపికైన విద్యార్థులకు 5000రూపాయలు నగదు ప్రధానం చేశారు.  మరియు చెకుముకి టాలెంట్ టెస్ట్ లో మండల స్థాయిలో ప్రతిభ చూపి జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులనువారు సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్  ఎస్ డానియల్,వైస్  ప్రిన్సిపాల్ ఎస్. పాపారావు, ఎలిమెంటరీ ఇంచార్జి యు. ప్రసన్న, పి.ఇ.టి బి.రవి. ఆఫీస్ ఇంచార్జ్ బి. లలిత తదితర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

About Author