NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అపుస్మా ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:   కర్నూలు పట్టణంలోని అపుస్మా(ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ )వారి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు నేడు ఏ క్యాంపు లోని మాంటిసోరి పాఠశాలలో వ్యాసరచన,వక్తృత్వము, చిత్రలేఖనము వంటి అంశాలలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో పోటీలు నిర్వహించడం జరిగినది. ఈ పోటీలను రాష్ట్ర అపుస్మ  వ్యవస్థాపకులు  వల్లపు రెడ్డి జనార్దన్ రెడ్డి , రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య , మాంటిసోరి స్కూల్ అధినేత రాజశేఖర్  తదితరులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర అపుస్మా సభ్యులు కెవిఆర్.శ్రీనివాసరెడ్డి,కర్నూలు జిల్లా ప్రసిడెంట్ వాసుదేవయ్య , సలహాదారులు పిబివి.సుబ్బయ్య, ,సిటీ ప్రసిడెంట్.యుగంధర్,  సెక్రటరీలు శ్రీనివాసులు , మాధవ కృష్ణ, రమణ తదితర ఈసీ సభ్యులు పాల్గొని విద్యార్థులకు స్వాగతం పలుకుతూ పోటీలను తిలకించారు.

About Author