మెడికవర్ హాస్పిటల్స్లో ప్రత్యేకంగా నిర్వహించిన డా. నాగ సురేష్ జన్మదిన వేడుక
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలులో సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డా. నాగ సురేష్ జన్మదినాన్ని ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ్చర్యకరంగా సీనియర్ న్యూరో సర్జన్ డా. సీతారాం కూడా పాల్గొని డా. సురేశ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంలో కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డా. విశ్వకుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డా. బి.ఎస్. ప్రవీణ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ సర్జన్ డా. భార్గవ వ్యాస్, కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డా. సరయు రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో ఫిజీషియన్ డా. రఘు నందిని ల తమ ప్రత్యేక శుభాకాంక్షలను తెలియజేసి, ఈ వేడుకలో పాల్గొన్నారు.వైద్య బృందంతో కలిసి కేక్ కట్టింగ్ నిర్వహించగా, కార్యక్రమంలో మెడికోవర్ క్లస్టర్ హెడ్ మహేశ్వర్ రెడ్డి కూడా పాల్గొని డా. నాగ సురేశ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.డాక్టర్ల మధ్య స్నేహభావం, ఐక్యతను ప్రతిబింబిస్తూ జరిగిన ఈ వేడుక హాస్పిటల్ వాతావరణాన్ని సందడి చేసింది.

