బళ్లారి రాజశేఖర్ పదోన్నతి పొందిన సందర్భంగా సన్మానం
1 min read
హొళగుంద న్యూస్ నేడు: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్,పంచాయతీ కార్యదర్శి (FAC)గా విధులు నిర్వహిస్తున్న బళ్లారి రాజశేఖర్ గ్రేట్ 3 పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతి పొందడంతో ఎంపీడీఓ విజయ లలిత పంచాయతీ సెక్రటరీలు రంగస్వామి,నాగరాజు,రాజ్ కుమార్,నాగరాజు,ఎంపిడిఓ కార్యాలయం సిబ్బంది ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎంపిడిఓ విజయ లలిత మాట్లాడుతూ మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గా గత ఏడు సంవత్సర కాలంలో ఎలా వేళల ప్రజలకు అందుబాటులో ఉంటూ అలుపెరగని సేవలు చేశారని కొనియాడారు.అలాగే ఇలాంటి పదోన్నతులు అంచలంచెలుగా ఎదగాలని ఆకాంక్షించారు.

