12న బైరాపురం’లో కాలభైరవ స్వామి దినోత్సవం
1 min read

మిడుతూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని బైరాపురం గ్రామంలో ఈనెల 12వ తేదీన ‘కాలభైరవ స్వామి దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.ఈ సందర్భంగా దేవాలయం దగ్గర 12వ తేదీ ఉ 7 గంటల నుండి అభిషేకములు,హోమము జరిపించడం జరుగుతుందని పురోహితులతో ప్రత్యేకంగా పూజలు చేయించడం జరుగుతుందని గ్రామస్తులు బంధువులు ఈ పూజల్లో పాల్గొనాలని గ్రామస్తులు తెలిపారు.మధ్యాహ్నం భక్తాదులకు భోజన వసతి ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.

