NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యనమలకుదురు జిల్లా పరిషత్ హైస్కూల్లో   చిల్డ్రన్స్ డే సంబరాలు..

1 min read

విజయవాడ, న్యూస్ నేడు : కొన్ని అనివార్య కారణాలవల్ల చిల్డ్రన్స్ డే కార్యక్రమం గత నెలలో జరగవలసిన కార్యక్రమం జరగకపోవడం వల్ల ఈరోజు బాలల దినోత్సవం కార్యక్రమం స్కూల్ హెచ్ఎం కె .శిరీష ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది.2024- 25 లో పదవ తరగతి చదివిన మెరిట్ విద్యార్థిని, విద్యార్థులకు నగదు బహుమతి, ప్రస్తుతం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు 15 మంది రాష్ట్రస్థాయి ఆటల పోటీలో 15 బహుమతులు గెలుచుకోవడం జరిగిందని, వారందరినీ సన్మానించి, వారికి బహుమతులు, స్థానిక దాతలు సహాయంతో నగదును అందజేయడం జరిగిందని, ఈ సంవత్సరం చదువుతున్న 10 వ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు చదువుకునే మెటీరియల్స్ స్థానిక దాతలు సహాయంతో అందరి చేయడం జరిగిందని రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరాం ప్రసాద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీమతి కె. శిరీష (ప్రధానోపాధ్యాయురాలు),  దాతలు          కె. మల్లేశ్వరరావు (ఎస్ టి ఓ విజయవాడ), వై శ్రీను (మాజీ హెడ్మాస్టర్), డి శ్రీను (పెండ్యాల), జే రామచంద్రరావు (పిడి), కె.దేవి( ఎస్ ఎం సి చైర్మన్), నీలం వెంకటేశ్వరరావు (ఓరియంటెడ్ ఇన్సూరెన్స్ బ్యాంకు మేనేజర్), కుమార్ గారు విజయవాడ (ఎస్ టి ఓ), ఎన్ భోజయ్య (ఎస్ ఎ బి ఎస్ స్టాఫ్ సెక్రెటరీ),జి గంగాధర్ ఎస్ ఏ పి ఎస్ మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చిర్రావూరి శేషు ఎడ్లపల్లి సురేష్ సత్య ఏడుకొండలు బలకం కొండ తదితరులు పాల్గొన్నారు.

About Author