NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర ఆఫ్కాఫ్ చైర్మన్ గా బియస్ నవీన్ కుమార్

1 min read

విద్యావంతుడు నవీన్ కుమార్ కు వరించిన పదవి..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: రాష్ట్ర ఆఫ్కాఫ్ చైర్మన్ గా ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన విద్యావంతుడు బిఎస్ నవీన్ కుమార్ కు రాష్ట్ర చైర్మన్ పదవిని ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ సందర్భంగా నూతన చైర్మన్ నవీన్ కుమార్మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి దిశలో కీలకమైన నిర్ణయాలను వేగవంతంగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని నాకు చైర్మన్ పదవి ఇవ్వడంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.రాష్ట్రంలో ఆఫ్కాఫ్ పరిపాలన,మత్స్య సహకార సంఘాల అభివృద్ధి మరియు సంబంధిత రంగాల్లో పారదర్శకతను పెంపొందించే చర్యలు మరింతగా అభివృద్ధి పొందేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తానని అన్నారు.ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన నవీన్ కుమార్ నియామకం జిల్లా మత్స్యకార వర్గాలకు సహకార సంఘాలకు మరియు మొత్తం ఆఫ్కాఫ్ వ్యవస్థకు మరింత బలాన్ని అందించే నిర్ణయంగా భావించబడుతోంది. నాపై ఎంత నమ్మకం ఉంచి చైర్మన్గా పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి మరియు మంత్రి యువనేత నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

About Author