మోటర్ సైకిల్ అదువు తప్పి వ్యక్తి మృతి
1 min read

హొళగుంద న్యూస్ నేడు : ప్రమాదంలో మృతి చెందిన రొడ్డె సిద్దప్ప మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంభ సభ్యులు హొళగుంది. హొళగుంద అయోధ్యనగర్‌లోని మహంకాళమ్మ గుడి వద్ద నివాసముంటున్న బోయ రొడ్డె సిద్దప్ప(45) అనే వ్యక్తి గురువారం స్థానిక బస్టాండ్ వద్ద బీసీ కాలనికి వెళ్లే రస్తాలో ఉన్న కొర్చెవంకలో మోటర్ సైకిల్ అదువు తప్పి దూసుకెళ్లి తీవ్ర గాయాలతో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. బైక్ పై బీసీ కాలని వైవు వెళ్తుండగ బస్టాండ్ వద్ద ఉన్న కొర్చెవంకలో బైక్ అదువు కాక వేగంగా వంకలోకి దూసుకెళ్లడంతో తీవ్ర రక్తగాయాలు కావడంతో స్థానికులు సిద్ధప్పను వంకలో నుంచి బయటకి తీయగ కొద్ది సేపటికే మృతి చెందగ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆలూరుకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు మగ పిల్లలు, ఒక కుమార్తె సంతానం. భార్య రొడ్డె రేణుకమ్మ ఇచ్చిన ఫిర్యదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యావున్న చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ శేషిరెడ్డి విలేకరులకు తెలిపారు. బస్టాండు, స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద కొర్చెవంక ఎలాంటి రక్షణ గోడలు, కట్టలు లేకుండా ఉన్నాయని సంబంధిత అధికారులు వెంటనే వంక పై రక్షణ గోడలు నిర్మించాలని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ షఫివుల్లా కోరారు.


