NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎఫ్ ఎల్ ఎన్  .. 100రోజుల ప్రణాళిక పరిశీలన : డీఈఓ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లా పరిధి లోని ఎంపీపీపీస్ ఓర్వకల్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను జిల్లా విద్యాశాఖా ధికారి ఎల్ సుధాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఎంపీపీయస్ ఓర్వకల్ పాఠశాల లో అమలౌతున్న ఎఫ్ ఎల్ ఎన్ పరీక్షలను పరిశీలించి సూచనలు చేశారు. మండల పరిధి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కన్నమడకల విద్యార్థులతో మాట్లాడి 100రోజుల ప్రణాళిక అమలు ను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఫిజికల్ సైన్స్ స్లిప్ టెస్ట్ -2 పరీక్ష ను పరిశీలించి సూచనలు చేశారు. అంతేకాకుండా ఓర్వకల్ ఎంఆర్ సి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈయనతో పాటు జిల్లా ఉపవిద్యాధికారి శ్రీధర్ బాబు, ఓర్వకల్ మండల విద్యాధికారి ఓంకార్ యాదవ్ వున్నారు.

About Author