NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తూతూ మంత్రంగా మండల సమావేశం

1 min read

45 నిమిషాల్లోనే సమావేశం ముగింపు

 మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగా సాగింది.అంతే కాకుండా 45 నిమిషాల్లోనే సమావేశాన్ని అధికారులు ముగించారు.ప్రతి మూడు నెలలకు ఒకసారి మండల సమావేశం జరగనుంది వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు ఏమైనా సమస్యలు ఉంటే సభ దృష్టికి తీసుకువస్తారు.12 మంది ఎంపీటీసీలు ఉండగా ఐదు మంది మాత్రమే హాజరయ్యారు.కోరం లేకుండానే సమావేశాన్ని ప్రారంభించి మండలంలో ఉన్న సమస్యల గురించి చర్చించకుండానే సమావేశాన్ని బిసమావేశాన్ని ముగించడం పట్ల కొందరు ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు.పీరు సాహెబ్ పేట సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు విలువల్లే కుండా అధికారులు పనిచేస్తున్నారని సర్పంచ్ అంటే అధికారులకు గౌరవం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ముందుగా వివిధ శాఖల మండల అధికారులు ప్రగతి నివేదికలను చదివారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ,ఎంపీడీవో దశరథ రామయ్య,సహకార సొసైటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి,వైస్ ఎంపీపీ నబి రసూల్,ఎంఏఓ పీరు నాయక్,ఎస్ఐ ఓబులేష్,ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.

About Author