జిల్లా అభివృద్ధికి కష్టపడి పని చేద్దాం
1 min read
అధికారులకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వివిధ శాఖల అధికారులు, సిబ్బంది
కర్నూలు, న్యూస్ నేడు: 2026 నూతన సంవత్సరంలో కర్నూలు జిల్లా అభివృద్ధికి మనమందరం సమిష్టిగా కష్టపడి పని చేద్దామని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులకు పిలుపునిచ్చారు.ఆంగ్ల నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకొని…. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, జిల్లా అధికారులు, ఇతర సిబ్బంది జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాను ప్రగతి పథంలో నడిపేందుకు జిల్లా అధికారులంతా కష్టపడి పని చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాల కనుగుణంగా నూతన సంవత్సరంలో జిల్లా అభివృద్ధికి, సమిష్టిగా నూతనోత్తేజంతో పనిచేద్దామని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ను జిల్లా అధికారులు, రెవిన్యూ శాఖ అధికారులు, సిబ్బంది కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


