సూపర్ 8 క్రికెట్ పోటీలు ప్రారంభం
1 min read
చాగలమర్రి రూరల్ న్యూస్ నేడు: చాగలమర్రి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సంక్రాంతి పర్వదినాన్ని పురష్కరించుకొని సూపర్ 8 క్రికెట్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ప్రధమ, ద్వితీయ బహుమతు దాతలుకావేరి,నామ్దారి సీడ్స్ ఆర్గనైజర్ ముల్లా షాకీర్,యంబి ఎలక్ట్రానిక్స్ వసీం అక్రంలు ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వహకులు ఖలీద్,అల్తాప్లు మాట్లాడుతూ మండలం లోని 36 జట్లు పాల్గొంటున్నాయన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ప్రధమ బహుమతి రూ 10 వేలు,ద్వితీయ బహుమతి జిలాన్ రూ 7 వేలు,తృతీయ బహుమతి రూ 3,500 లు పెయింటర్ సద్దాంలు అందజేస్తారని వారు వివరించారు. కార్యక్రమంలో అసీఫ్,ఫరుక్,కడ్డీ మహబూబ్భాష,షాహిద్,మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.

