” జాతీయ యువ దినోత్సవం సందర్భంగా వర్క్ షాప్ ”
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, సోమవారం నాడు కర్నూలు జిల్లా కోర్టు నందు గల న్యాయ సేవ సదన్ నందు డ్రగ్స్ రహిత భారతదేశంపై వర్క్ షాప్ నిర్వహించారు. పుల్లయ్య కాలేజీ విద్యార్థులకు,ప్యారా లీగల్ వాలంటీర్లకుమరియు ప్యానల్ న్యాయవాదులకు మాదకద్రవ్యాల వినియోగం వలన యువతకు జరిగే దుష్ప్రభావాలపై ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ నందు జడ్జిగారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వలన యువతకు కలిగే ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు,సామాజిక దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జాతీయ యువ వారోత్సవాల్లో భాగంగా ఈనెల 5వ తారీఖు నుండి 12వ తేదీ వరకు స్కూల్స్, హాస్టల్స్ మరియు కాలేజీల నందు అనేక న్యాయ విజ్ఞాన సదస్సులు చేసి యువతకు మాదకద్రవ్యాల వినియోగం వలన జరిగే అనార్థాలను గురించి వివరించా మని తెలిపారు. జనవరి 12వ తేదీ వివేకానందుని జన్మదినం సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేశారు. వివేకానంద స్ఫూర్తిగా తీసుకొని యువత జీవితంలో అభివృద్ధి పథంలో నడవాలని సూచించారు. న్యాయవాది గీతామాధురి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్. 1933 మరియు లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 ల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. “డ్రగ్స్ వద్దు -జీవితమే ముద్దు”అనే ప్రతిజ్ఞను విద్యార్థులు చేత చేపించారు.అనంతరం పుల్లయ్య విద్యాసంస్థల అధినేత పుల్లయ్య మాట్లాడుతూ నేటి యువతే దేశానికి పట్టుకొమ్మలని యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా సమాజం కోసం పాటుపడాలని కోరారు.యువత వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ సదస్సులో పుల్లయ్య కాలేజీ విద్యార్థులు, ప్యారా లీగల్ వాలంటీర్స్,ప్యానెల్ లాయర్స్ పాల్గొన్నారు.

