మంగళగిరిలో ‘మగువ హ్యాండ్లూమ్స్’ షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
1 min read

మంగళగిరి, న్యూస్ నేడు: పాత మంగళగిరి 26వ వార్డులో జగ్గారపు వివేక్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన ‘మగువ హ్యాండ్లూమ్స్’ షోరూమ్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కు నిర్వాహకులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ను మంత్రి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. చేనేత చీరలను కొనుగోలు చేశారు. అనంతరం అందరితో కలిసి మంత్రి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

