క్రీడలతో.. ఏకాగ్రత
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: క్రీడలతో క్రమశిక్షణ వస్తుందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ అన్నారు. గాయత్రీ ఎస్టేట్ లోని గురుదత్త పాలీక్లినిక్ లో నిరుపేద చిన్నారులకు క్రీడా కిట్ లను డాక్టర్. శంకర్ శర్మ అందజేశారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్ శర్మ మాట్లాడుతూ చిన్నారులను క్రీడల పట్ల ఆసక్తి పెంచడం కోసం వారికి పుట్ బాల్,వాలీబాల్, త్రోబాల్స్ పంపీణీ చేశానన్నారు. చిన్న తనం నుంచే క్రీడల్లో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఉంటుందని డాక్టర్. శంకర్ శర్మ తెలిపారు. గ్రైండ్ లో ఎలాంటి బాల్స్ లేకుండా క్రీడలు అడుతున్న చిన్నారులను గుర్తించి వారికి తన వంతుగా బాల్స్ అందించడం జరిగిందన్నారు. క్రీడలు ఆడడం వల్ల దేహధారుడ్యం, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. ముఖ్యంగా చిన్నారులు సెల్ ఫోన్ కే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని సెల్ ఫోన్ ఎక్కువ చూడడం వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటికి దూరంగా ఉండి క్రీడా మైదానంలో ఆటలు ఆడాలని డాక్టర్. శంకర్ శర్మ సూచించారు. ఈకార్యక్రమంలో ఆదరణ నిర్వహకులు రంజిత్ పాల్గొన్నారు.

