NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా బాలల సంరక్షణ కేంద్రాల ఆకస్మిక తనిఖీలు…  

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  డి.ఎల్.ఐ సి ఆధ్వర్యంలో జిల్లా బాలల సంరక్షణ కేంద్రాల ఆకస్మిక తనిఖీలు.   కర్నూలు జిల్లా స్థాయి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బాలల సంరక్షణ కేంద్రాల సమగ్ర తనిఖీ కార్యక్రమం జిల్లా జాయింట్ కలెక్టర్ డీ.ఎల్.ఐ.సీ చైర్మన్ నూరుల్ ఖమర్ ఆదేశాల మేరకు  గార్గేయపురంలో ఉన్న ఇన్ఫంట్ జీసస్ హోమ్- అభయగిరి,ప్రభుత్వ బాలుర పరిశీలనగృహలను పరిశీలించారు. అక్కడి వసతులు, సిబ్బంది పనితీరు, పర్యవేక్షణ విధానం, రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత,ఆరోగ్య భద్రతలపై పరిశీలించారు.ఈ కార్యక్రమంలో డి.ఎల్.ఐ.సి కన్వీనర్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు మధుసూదన్, ఎన్జీవో లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, తాండ్రపాడు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంజుష, సైకాలజిస్ట్ కే. చంద్రశేఖర్,ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషన్స్ కేర్ పద్మ తదితరులు పాల్గొన్నారు.

About Author