NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెన్షన్‌దారుల చిరునవ్వులే కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనకు కేరాఫ్‌ అడ్రస్‌

1 min read

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెన్షన్‌దారుల చిరునవ్వులే కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనకు కేరాఫ్‌ అడ్రస్‌ అనిఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభివర్ణించారు. అదేలక్ష్యంతో రానున్న రోజుల్లో మరింత మంది అర్హులకు సామాజిక భద్రతా పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక్కరోజు ముందుగానే పెన్షన్‌దారుల ఇళ్ళకు పెన్షన్‌ సొమ్ములు పంపిణీ చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా శనివారం తెల్లవారుజామునే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈసందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ       ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించవచ్చునని, ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారమార్గం చూపేందుకు విశేషంగా కృషిచేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, ఎఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటి మేయర్‌ కర్రి శ్రీనివాస్‌, క్లస్టర్ ఇంచార్జ్ ఆర్‌ఎన్‌ఆర్‌ నాగేశ్వరరావు, టిడిపి డివిజన్‌ ఇన్‌ఛార్జ్‌ లు అట్లూరి రామ కృష్ణ, కొండే రాణి నిర్మలా కుమారి, డివిజన్‌ నాయకులు కొసరాజు నాగ సతీష్‌, కూటమి నాయకులు రెడ్డి నాగరాజు, దాకారపు రాజేశ్వరరావు,  నడపన దాన భాస్కర్‌, కన్నా ప్రసాద్, టీ. శ్రీనివాస్, వేల్పుల అరుణ,మరియు వివిధ హోదాలో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నరు.

About Author