NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గిరిజన అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు

1 min read

జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఐటిడిఏ నిధులు ఖర్చు చేస్తే కఠిన చర్యలు-ఐటిడిఏ నిధుల వినియోగంపై సమగ్ర విచారణ

గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాల పనులు మార్చ్,31వ తేదీ నాటికి పూర్తిచేయాలి

ఐటిడిఏ కార్యక్రమాలను అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గిరిజన ప్రాంతాలలో అభివృద్ది,  సంక్షేమ పధకాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో శనివారం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ  గిరిజనులు గిరిజనుల సామజిక, ఆర్ధిక అభివృద్ధికి , గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి జన్ మన్ యోజన, ధర్తి ఆబా జనభాగిదారి అభియాన్ వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు.   ప్రధానమంత్రి జన్ మన్ యోజన, తదితర కార్యక్రమాల ద్వారా  మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు గృహాలు, త్రాగునీరు, రోడ్లు, విద్యుత్, విద్యా, ఆరోగ్య సదుపాయాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేసిందని, వాటికి సంబందించిన పనులను మార్చ్ నెలాఖరు నాటికి పూర్తిచేసి, నిధులు పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు.  కఠిన చర్యలు-ఐటిడిఏ నిధుల వినియోగంపై సమగ్ర విచారణ-జిల్లా కలెక్టర్ ఐటిడిఏ లో అకౌంట్స్ అధికారి బదిలీ అయి 3 నెలలు అయినప్పటికీ వారి స్థానంలో వేరొకరిని నియమించకపోవడం, నిధులు వినియోగంపై ఐటిడిఏ  ప్రాజెక్ట్ అధికారి రాములు నాయక్ పై కలెక్టర్  వెట్రిసెల్వి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఐటిడిఏ నిధులను జిల్లా కలెక్టర్ అనుమతితో మాత్రమే ఖర్చు చేయాలన్నారు.  సమావేశంలో డిఎంహెచ్ఓ డా: పి .జె. అమృతం, ట్రాన్స్కో ఎస్ఈ సాల్మన్ రాజు,   ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ త్రినాధ్ బాబు, ఐసిడిఎస్ పీడీ శారద, డిఈఓ వెంకటలక్ష్మమ్మ , డిఆర్డిఆ పీడీ విజయలక్ష్మి,  పంచాయతీ రాజ్ ఎస్ఈ, ఐటిడిఏ లో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author