మెడికవర్ ‘ లో సీపీఆర్ పై అవగాహన
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించడంలో కీలకమైన సీపీఆర్ (CPR – Cardiopulmonary Resuscitation) పై అవగాహన కల్పించే ఉద్దేశంతో మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలులో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డా. టి.వి. సునీల్ యాదవ్, సీనియర్ కన్సల్టెంట్ & హెడ్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ విభాగం నిర్వహించింది.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, పేషెంట్లు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొని సీపీఆర్ విధానం గురించి ప్రాక్టికల్ డెమో ద్వారా అవగాహన పొందారు. గుండెపోటు లేదా అకస్మాత్తుగా శ్వాస ఆగిపోయే పరిస్థితుల్లో సకాలంలో సీపీఆర్ అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని వైద్యులు తెలిపారు.ఈ సందర్భంగా డా. టి.వి. సునీల్ యాదవ్ మాట్లాడుతూ, “అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ లేదా వైద్య సహాయం చేరుకునేలోపు మొదటి కొన్ని నిమిషాలు అత్యంత కీలకం. సీపీఆర్ పద్ధతి గురించి సాధారణ ప్రజలకు అవగాహన ఉండటం వల్ల అనేక ప్రాణాలను కాపాడవచ్చు” అని తెలిపారుమెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు హెడ్ శ్రీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రజలలో అత్యవసర వైద్యంపై అవగాహన పెంచడం కూడా మా బాధ్యతలో భాగమే. ఇలాంటి కార్యక్రమాల ద్వారా సాధారణ ప్రజలు కూడా ప్రాణరక్షణలో భాగస్వాములు కావచ్చు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తాం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సీపీఆర్ విధానం గురించి ప్రత్యక్షంగా నేర్చుకోవడం ద్వారా అవగాహన పెరిగిందని తెలిపారు. మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు ప్రజల ఆరోగ్య భద్రత కోసం వైద్య సేవలతో పాటు అవగాహన కార్యక్రమాలను కూడా నిరంతరం నిర్వహిస్తోంది.

