NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్టేట్ లెవెల్ సైన్స్ ఒలంపియాడ్ లో గురు రాజా విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ

1 min read

గోల్డ్ మెడల్ సాధించిన గురురాజా విద్యార్థి పి. సరయు

హైదరాబాదు, న్యూస్​ నేడు:  సుచిరిండియా ఫౌండేషన్ వారు నిర్వహించిన సివి రామన్ యంగ్ జీనియస్ స్టేట్ లెవెల్ సైన్స్ ఒలంపియాడ్ నందు శ్రీ గురు రాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులను సాధించినట్లుగా స్కూల్ డైరెక్టర్ పి షేక్షావల్లి  తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుండి 450 పాఠశాలలను 76వేల మంది విద్యార్థులు పాల్గొనగా స్టేట్ లెవెల్ ఒలంపియాడ్ కాంపిటీషన్లో పాఠశాల విద్యార్థినీ పి. సరయు గోల్డ్ మెడల్ సాధించింది. హైదరాబాదు నగరం లలిత కళా తోరణంలో సుచిర్ ఇండియా ఫౌండేషన్ చైర్మన్ లయన్ కిరణ్  ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ సాధించిన పి. సరయు ముఖ్య అతిధులైన ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్, మాజీ మంతి గంటా శ్రీనివాస రావు, శాసనసభ్యులు  చింతమనేని ప్రభాకర్, ప్రముఖ సినీ నటుడు శివాజీ రాజా చేతుల మీదుగా అందుకుంది. మేము బ్రెయిన్ బాక్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు మాథ్స్ ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ సబ్జెక్టు నందు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఓరియంటేషన్ ప్రోగ్రాం ద్వారా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాము అనడానికి ఈ ర్యాంకులే నిదర్శనమని తెలిపారు విద్యార్థులకు విజయాలకు శిక్షణ అందించిన ఒలంపియాడ్ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.

About Author