వాటర్ బాడీస్ (నీటి వనరులు, చెరువులు)లో ఆక్రమణలు ఉండకూడదు
1 min read

జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
కర్నూలు, న్యూస్ నేడు : వాటర్ బాడీస్ (నీటి వనరులు, చెరువులు)లో ఆక్రమణలు ఉండకూడదని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో నీటి వనరులు మరియు చెరువు ల ఆక్రమణ లకు సంబంధించి జిల్లా స్థాయి వాచ్ డాగ్ కమిటీ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వాటర్ బాడీస్ లో ఆక్రమణలు ఏమైనా జరిగినట్లయితే వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు…. ఆక్రమణలు ఏమైనా జరుగుతున్నట్లయితే ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండి, వాటిని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.. ఆక్రమణ లకు సంబంధించి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశం లో డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, డిపిఓ భాస్కర్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, కర్నూలు అర్బన్ తహసిల్దార్ రవి, కర్నూలు రూరల్ తహసిల్దార్ రమేష్, కల్లూరు తహసిల్దార్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.


