వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలి
1 min read

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్న ప్రసాద్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మెనూ ప్రకారం వసతి గృహంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించి, స్వంత బిడ్డల్లాగా చూసుకోవాలని ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు సూచించారు. రాష్ట్ర న్యాయ సేవధికార సంస్థ అమరావతి వారి ఆదేశాలు ప్రకారం ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు, బుధవారం శనివారపేటలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. పరిసరాలను పరిశీలించి, విద్యార్థులతో అందుకున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు మాట్లాడుతూ ప్రతినెల గ్రహాన్ని సందర్శించి గృహంలోని బాలురకు అందిస్తున్న వసతులుపై విచారణ నిర్వహించి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారికి నివేదిక పంపించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వసతి గృహాన్ని సందర్శించడం జరిగిందని అన్నారు. అలాగే అబ్జర్వేషన్ లోని బాలురకు న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలుపైన అవగాహన కలిగించడం జరిగిందని తెలియజేశారు. ఈ వసతి గృహంలో కొన్ని రకాలు కూరగాయలను, ఆకుకూరలను పండించి విద్యార్థులకు అందిస్తున్నారని, ఇది సూపరింటెండెంటును మరియు సిబ్బందిని అభినందించటం జరిగిందని తెలిపారు. ప్రస్తుత కాలంలో ప్రకృతి సేద్యం ద్వారా పండించిన కూరగాయలు పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు కోనే సునీత, పుచ్చల వెంకటేశ్వర రావు, వసతి గృహ సూపరింటెండెంటు శ్రీమతి శ్రీవల్లి, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

