NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ప్రమాణ స్వీకారం

1 min read

హోలగుంద న్యూస్ నేడు: ఎం.డి.హళ్లి  సుధాకర్  ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏపీ కురవ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప  మరియు టీడీపీ యువనాయకుడు రాజేంద్ర గౌడ్  కార్యక్రమానికి హాజరై సుధాకర్ ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొన్నారు.అనంతరం ఆయనను శాలువాతో సన్మానించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధి మరియు ప్రజాసేవలో ఆయన విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.అదేవిధంగా ప్రసిద్ధి చెందిన  ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కూడా దేవేంద్రప్ప  మరియు రాజేంద్ర గౌడ్  వెళ్లి సుధాకర్ ని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అయ్యప్ప  టీడీపీ నాయకులు మంగళి వెంకటేష్ , కురవ మల్లికార్జున , అలాగే టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు మలి సిద్ధు  పాల్గొని సుధాకర్ గారికి అభినందనలు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

About Author