ఇంటర్ పరీక్షలను తనిఖీ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్
1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి.శనివారం ఉదయం కళాశాలలో జరుగుతున్న పరీక్ష కేంద్రాన్ని నంద్యాల జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు డాక్టర్ సి రామలింగారెడ్డి మరియు డిప్యూటీ తహసిల్దార్,ఏఎస్ఐ తనిఖీ చేశారు.ఇంటర్ ద్వితీయ సంవత్సరం వృక్షశాస్త్రం (బాటనీ)పరీక్షకు 57 మంది విద్యార్థులందరూ పరీక్షకు హాజరయ్యారని చీఫ్ సూపరింటెండెంట్ తిరుమలేశ్వర్ రెడ్డి అన్నారు.

