మెడికవర్ హాస్పిటల్స్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని Medicover Hospitals Kurnool లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా M Deepika Patil (IPS, APSP-2 బెటాలియన్, కర్నూలు) హాజరై మహిళల సాధికారత, ఆరోగ్య పరిరక్షణ మరియు సమాజంలో మహిళల పాత్రపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.కార్యక్రమంలో ఆసుపత్రికి చెందిన మహిళా వైద్యులు కూడా పాల్గొన్నారు., “సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పది. ఆరోగ్య రంగంలో మహిళలు చేస్తున్న సేవలు ప్రశంసనీయం. మా ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా వైద్యులు మరియు సిబ్బంది అందరూ తమ ప్రతిభతో సేవలందిస్తూ ఆసుపత్రి అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం మా గౌరవంగా భావిస్తున్నాం” అని తెలిపారు.

