క్రమ శిక్షణ తో కూడిన విధ్యే.. ‘ హారిజన్స్ ‘ లక్ష్యం
1 min read

రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి. పుల్లయ్య
ఘనంగా హారిజన్స్ ప్లే స్కూల్ ఐదవ వార్షికోత్సవం
కర్నూలు, న్యూస్ నేడు: నగరం లోని గణేష్ నగర్ లోని హారిజన్స్ ప్లే స్కూల్ వార్షికోత్సవం సి. క్యాంపు నందు టీజీవి కళాక్షేత్రంలో నిర్వహింపబడింది. హరిజన్స్ ప్లే స్కూల్ సీఈవో పి. ప్రదీప్ కుమార్, డైరెక్టర్ కె. పావని ల అధ్యక్షతన నిర్వహింపబడిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య , టీజీవి కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య , రవీంద్ర టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ పిబివి. సుబ్బయ్య, చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్వేత రాంపల్లె విచ్చేశారు. ఈ సందర్బంగా జి పుల్లయ్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి కాలగమనం బిజీ జీవితంతో గడిచిపోతుంది. ఈ బిజీ అనే పేరుతో తల్లిదండ్రులు పిల్లలను చూసుకోవడం కూడా కష్టతరంగా మారిపోయింది. కానీ హారిజాన్స్ ప్లే స్కూల్స్ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా, కుటుంబ విలువలను పెంచేవిగా, విద్యార్థుల భావి జీవితాలను ఉన్నత దశగా మార్చేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాల్య జీవితంలో విద్యార్థుల హృదయాల్లో నాటిన ఈ బీజాలే వారు పెరిగి పెద్దవారైన తర్వాత మహావృక్షాలుగా ఎదగడానికి కారణమౌతాయి.కావున తల్లిదండ్రులు పిల్లలను ఉత్తమ పాఠశాలల్లో చేర్పించాలని,ఉన్నత ఆశయాలతో నడపబడుతున్న హారిజాన్స్ లాంటి స్కూళ్లల్లో మీ పిల్లలను చేర్పించి మీరు నిశ్చింతగా ఉండాలన్నారు. హారిజాన్స్ ప్లే స్కూల్లో ఉన్న కరికులం ఎంతోమంది మేధావులను సంప్రదించిన అనంతరం తీసుకున్న అత్యుత్తమ కరికులం అని వారు గుర్తు చేశారు. ఇది విద్యార్థుల మేధో వికాసమునకై ఎంతగానో ఉపయుక్తమవుతుందన్నారు.అనంతరం పిబివి. సుబ్బయ్య గారు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మా ఉపాధ్యాయులకు నిరంతరము తర్ఫీదునిస్తూ విద్యార్థుల భావి జీవితానికి పునాదులు వేస్తామన్నారు. ప్రతి విద్యార్థిని నిశిత పరిశీలన చేసి వారి జ్ఞానానికి అనుగుణంగా శిక్షణ ఇస్తూ వారిలో మార్పులు తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర విద్యాసంస్థల వైస్ చైర్మన్ జి.వంశీధర్, గణిత మాంత్రికుడు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. అకాడమిక్ లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగినది. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

