PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ఆర్ఆర్ ‘ దోస్తీ ’ సాంగ్ వ‌చ్చేసింది

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఎన్నో రోజుల ఎదురుచూపుకు తెర‌ప‌డింది. పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ నుంచి తొలి సాంగ్ విడుద‌ల‌యింది. దోస్తీ అంటూ సాగే ఈ పాట‌ను స్నేహితుల దినోత్సవం సంద‌ర్భంగా చిత్రబృందం విడుద‌ల చేసింది. ఎమ్.ఎమ్. కీర‌వాణి సంగీత సార‌థ్యంలో ప్రముఖ సింగ‌ర్ హేమ‌చంద్ర గేయాలాప‌న చేశారు. ఆదివారం ఉద‌యం విడుద‌లైన దోస్టీ పాట ప్రతి ఒక్కరినీ ఆక‌ట్టుకుంటోంది. ఐదు భాష‌ల‌కు చెందిన ప్రముఖ సింగర్ ల‌తో ఈ పాట‌ను ఐదు భాష‌ల్లో పాడించారు. ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ స్నేహానికి ప్రతీక‌గా ఈ పాట‌ను రూపొందించిన‌ట్టు తెలుస్తోంది.

About Author